గిరిజనులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ నిర్మాణం కానుంది. ఈ నేపథ్యంలో గిరిజన యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం 221 ఎకరాల భూమిని ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈనెల 26న జరిగే క్యాబినేట్ లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంకు బదలాయింపు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.