ములుగు జిల్లాలో అడవి పందిని చంపిన వారిపై కేసు నమోదు

76பார்த்தது
ములుగు జిల్లాలో అడవి పందిని చంపిన వారిపై కేసు నమోదు
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామ శివారులోని హనుమాన్ టెంపుల్ సమీప అడవిలో ఇటీవల అడవి పందిని చంపి మాంసం విక్రయిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి అడవి పంది మాంసం విక్రయిస్తున్న రమేశ్, భీముడు, సంపత్ ను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేసి శనివారం వారికి రూ. 50 వేల రూపాయల జరిమానా విధించారు.

தொடர்புடைய செய்தி