మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ ప్రజా పాలన విజయోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 19న చలో హనుమకొండ జరిగే సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని కోరారు.