ఆకలి రాజ్యం, దోపిడీ రాజ్యం ఉన్నంతకాలం విప్లవాలు ఎగిసిపడుతూనే ఉంటాయని న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్రావు అన్నారు. గురువారం రాత్రి కొత్తగూడలో పాలడుగు కృష్ణ సంస్మరణ సభలో ముఖ్యఅథితిగా పాల్గొని మాట్లాడారు. భూస్వాములు, వర్గ సమాజం ఉన్నంత కాలం ఉద్యమాలు ఉంటాయన్నారు. మరో రెండేళ్లలో విప్లవకారులు ఉండరని పాలకులు పేర్కొనడం హాస్యాస్పదమ న్నారు.