మహబుబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలని చేస్తున్న ఉపవాస దీక్ష లో గురువారం పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గోని సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేం వెంకట కృష్ణారెడ్డి, నర్సింహ నాయక్ తో పాటు పలువురు పాల్గొన్నారు.