జనగామ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డీఎస్సీ వేయలేదు, గత పదేళ్లలో ప్రభుత్వ విధానాలు సరిగా లేవని అడిగినందునే కేసీఆర్ నన్ను పక్కన పెట్టిండని అన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో తెలువదు. ఆయన తర్వాతి స్థానం కోసమే బావ బామ్మర్దులు హరీష్ రావు కేటీఆర్ పోటీ పడుతున్నారని తెలిపారు.