జనగామ పట్టణంలోని బాణాపురంలో గురువారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బృందాల వారిగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలతో పాటు మూడు బెల్ట్ షాపుల్లోని మద్యం సీజ్ చేశారు. ముగ్గురు పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.