జనగామ జిల్లా కేంద్రంలో సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఇంటింటి సర్వే కు ప్రజలు సహకరించాలని కోరారు. డివిజన్ స్థాయిలో ఒక అధికారితో పాటు ఎన్యూమరేటర్ లు ప్రతి ఇంటికి తిరిగి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు ఉంటే చాలని వారు ఇచ్చిన వివరాలను నమోదు చేస్తారని చెప్పారు.