జనగామ: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం

83பார்த்தது
జనగామ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యలను పరిష్కరించి, జీవో నెం 29 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ఎస్ఎఫ్ఐ నాయకులకు మధ్య తోపులాట జరిగింది.

தொடர்புடைய செய்தி