మధ్యాహ్న భోజన పథకంపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెడమాస్టర్లు, సంక్షేమ పాఠశాలల ప్రిన్సిపాల్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో జనగాం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వంట పాత్రలను పరిశుభ్రం చేయాలన్నారు.