జనగామ జిల్లా పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో శుక్రవారం మాదంశెట్టి మహోన్నతు (7)అనే బాలుడి పై వీధికుక్కల దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఇటీవల కాలంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని పట్టణ వాసులు తెలుపుతున్నారు. అధికారులు కుక్కల బెడద నుండి తప్పించాలని కోరుతున్నారు.