మహబుబాబాద్ జిల్లా సీరోలు మండలం చిల్కోయలపాడులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి యాకుబ్ పాషాపై ఆదివారం దాడి జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం సర్వే నిర్వహిస్తుండగా అనంతరెడ్డి అనే వ్యక్తి అకారణంగా దాడి జరిపి తనను గాయపరిచినట్లు కార్యదర్శి పాషా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు చెప్పారు.