భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కేంద్రంలోని షేక్ చోటు మియా, షేక్ సలీం అనే ఇద్దరి కి చెందిన ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇండ్లలో ఎవరు లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రెండు తులాల బంగారం, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఒకే కుటుంబానికి చెందిన రెండు ఇండ్లలో ఏకకాలంలో చోరీ జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు.