భూపాలపల్లి జిల్లా నుంచి వరంగల్ కు అక్రమంగా టాటా ఏసీ వాహనంలో కలప తలిస్తుండగా మంజుర్ నగర్ వద్ద అటవీశాఖ అధికారులు దాడులు చేసి కలప పట్టుకున్నట్లు అటవీ శాఖ అధికారిని వసంత మంగళవారం తెలిపారు. అక్రమంగా కలప తరలిస్తున్నారన్న సమాచారంతో మంజునగర్ వద్ద దాడి చేసి పట్టుకున్నట్లు వాహన డ్రైవర్, ఓనర్లు పరారైనట్లు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసామన్నారు. పట్టుకున్న కలప విలువ సుమారు రూ. 1, 50, 000 ఉంటుందని తెలిపారు.