కాలేశ్వరంలో జిల్లా కలెక్టర్ పూజలు

54பார்த்தது
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రాజగోపురం నుండి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారి ఆలయంలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకున్న అనంతరం అర్చకస్వాములు స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி