భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పవిత్ర కార్తీకమాసం ఆదివారం కావడంతో భక్తుల రద్దీ నెలకుంది. వేకువజామున నుండే సుదూర ప్రాంతాలతో పాటు మహరాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకోని త్రివేణి సంగమ గోదావరి నదిలో కార్తీక పుణ్యస్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలు వదిలారు. స్వామివారికి మారేడు దళాలు సమర్పించి, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు.