వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం చిల్ముల్ మైల్వార్ నాజఖాన్పల్లి మధ్య నుంచి కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామాన్ని కలిపే రోడ్డు మార్గానికి డబుల్ రోడ్డు మంజూరు కావడంతో మంగళవారం నాయకులు పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య మాట్లాడుతూ. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో డబుల్ రోడ్లు మంజూరైందని, కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు.