చేవెళ్ల: కంది సాగుకు పెరిగిన మద్దతు ధర

59பார்த்தது
చేవెళ్ల: కంది సాగుకు పెరిగిన మద్దతు ధర
చేవెళ్ల డివిజన్‌ పరిధిలో రైతులు కంది పంటను అధికంగా సాగు చేశారు. ఈ ఏడాది కురిసిన వానలను తట్టుకొని పంట ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. చేవెళ్ల మండలంలో 6087 ఎకరాలు, షాబాద్‌ మండలంలో 4956, శంకర్‌పల్లిలో 6019, మొయినాబాద్‌లో 5369 ఎకరాల్లో కంది సాగైనట్లు వ్యవసాయ అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం కందికి మద్దతు ధర పెంచింది. గత ఏడాది ధర క్వింటాలుకు రూ. 6300 ఉండగా, ఈ ఏడాది రూ. 7550గా ప్రకటించింది.

தொடர்புடைய செய்தி