ఉచిత వైద్య శిబిరం

65பார்த்தது
ఉచిత వైద్య శిబిరం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో పూర్వ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మహావీర్ హాస్పిటల్ వారు మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిఎన్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవేందర్ మాట్లాడుతూ. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

தொடர்புடைய செய்தி