వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని రోటిబండతండా, పులిచెర్లకుంట తండా, లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాలకు చెందిన పలువురు ఫార్మా బాధితులు గురువారం ఫార్మా కంపెనీకి మా భూములు ఇవ్వమని డిప్యూటీ MROకు వినతిపత్రం అందజేశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి మీటింగులు ఏర్పాటు చేస్తే బహిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఫార్మా రైతులు బాధితులుగా ఉన్నారు.