సాంకేతిక సమస్యలతో పలువురు రైతులకు రుణమాఫీ ఆలస్యం అవుతుందని గురువారం చౌడపూర్ మండల కేంద్రంలో సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ. రుణమాఫీ విషయంలో సాంకేతిక సమస్యను పట్టుకొని బిఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం సమంజసం కాదన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందన్నారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.