వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బ్రాహ్మన్ పల్లి పెద్దతండ గ్రామపంచాయతీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని గురువారం గ్రామస్తులు తెలిపారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ. గత వారం రోజుల నుండి జ్వరాలు మొదలై మెల్లగా ఒకరిని నుండి ఒకరికి వ్యాపించి ప్రజలు మంచాన బారిన పడుతున్నారని, సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని తండావాసులు కోరుతున్నారు.