కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలం, విజయవాడ, రాజమహేంద్రవరం, వేములవాడ, భద్రాచలం ప్రాంతాల్లోని ఆలయాల్లో రద్దీ నెలకొంది. కృష్ణా, గోదావరి నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. ఆ తర్వాత పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.