టెంపుల్ టూరిజం, ఆలయాల అభివృద్ధి కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రసాద్’ పథకం కింద తెలంగాణలోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం వేములవాడ ఎంపికైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో తీర్థయాత్ర పునరుజ్జీవనం, స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం కింద టెంపుల్ టూరిజం మరింత పుంజుకోనుంది. ఇప్పటికే 3 ఆలయాలను కేంద్రం ఈ పథకం కింద ఎంపిక చేసింది.