అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ ఆనందరావు ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లా నైట్ అలెర్టింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించిన ఆయన, అర్థరాత్రి వరకు సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. పని ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు ఆరోపిస్తున్నారు. గతేడాది సెప్టంబర్ లో ఆయన ప్రొద్దుటూరు నుండి తాడిపత్రికి బదిలీపై వచ్చారు.