నిబంధనలను అతిక్రమిస్తే నేరుగా మొబైల్ నెంబర్‌కు ట్రాఫిక్ చలాన్‌

74பார்த்தது
నిబంధనలను అతిక్రమిస్తే నేరుగా మొబైల్ నెంబర్‌కు ట్రాఫిక్ చలాన్‌
ట్రాఫిక్‌ చలాన్ పెండింగ్‌లు పెరుగుతోన్న నేపథ్యంలో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనదారుడు ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించిన వెంటనే నేరుగా అతడి మొబైల్ నెంబర్‌కు ట్రాఫిక్ చలాన్‌లు పంపించనున్నారు. ఆపై చలాన్లు సులభంగా చెల్లించేందుకు వీలుగా.. యూపీఐ యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఆప్షన్స్ కల్పించాలని భావిస్తోంది. అంటే చలాన్లు పడిన వెంటనే చాలా ఈజీగా వాటిని క్లియర్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ విధానం ప్రయోగాత్మక దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி