భూమి కోసం.. భుక్తి కోసం.. బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం జరిగింది సాయుధ పోరాటమైతే.. అందులో తెలంగాణ నిప్పుకణికగా నిలిచింది చాకలి ఐలమ్మ. వెట్టిచాకిరీ విముక్తి కోసం కొంగు బిగించి ఉద్యమంలోకి దూకి భూస్వాములకు వణుకు పుట్టించింది వీరనారి చాకలి ఐలమ్మ. ఆడది అబల కాదు సబల అని నిరూపించి దాస్యవిమోచన కోసం భూస్వాములతో పోరాడి అమరురాలైంది. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ 129వ జయంతి నేడు.