తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్య్రం తరువాత ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయని.. అంతే వేగంగా అవి కనుమరుగయ్యాయని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వ్యాఖ్యానించారు. కానీ రెండు పార్టీలే నిలదొక్కుకున్నాయని అన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టిన టీడీపీ, తెలంగాణ అస్తిత్వం కోసం స్థాపించిన BRS పార్టీలు మాత్రమే ఇప్పటికీ నిలిచాయని చెప్పారు. ఈ ఏడాది BRSకు ఎంతో కీలకమని.. అందరూ కాంగ్రెస్ పార్టీపై పోరాడాలని పిలుపునిచ్చారు.