భారతదేశ మార్కెట్లో సాధారణంగా కిలో బియ్యం రకాన్ని బట్టి రూ.30 నుంచి రూ.200 వరకు ఉంటుంది. అయితే అదే బియ్యం ధర కిలో ఏకంగా రూ.14,000 ఉంది అంటే నమ్ముతారా? అవును.. మీరు విన్నది నిజమే. జపాన్‌లో పండించే ఈ బియ్యం పేరు ‘జపనీస్ కిన్మెమై రైస్’. భూమ్మీద పండే అత్యంత ఖరీదైన బియ్యంగా ఈ బియ్యం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఈ బియ్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఈ బియ్యం కిలో 110 డాలర్ల నుంచి 160 డాలర్ల వరకు ఉంటుంది.