హిందూ సంప్రదాయాలలో గొబ్బెమ్మను గౌరీ మాతగా కొలుస్తారు. సంక్రాంతి పండుగ రోజున ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెడతారు. వాటికి పసుపు కుంకుమ పూలతో అలంకరిస్తారు. ముగ్గులు గొబ్బెమ్మలు అంటే లక్ష్మీదేవతకి కూడా చాలా ఇష్టమని నమ్ముతారు. అందుకే పండుగ రోజున గొబ్బెమ్మలు పెట్టి స్త్రీలు చుట్టూ తిరుగుతూ పూజలు చేసి తమ కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో దీవించాలని కోరుతూ లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇది గొబ్బెమ్మలకు ప్రత్యేకత.