ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన రఘురామకృష్ణరాజుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వాళ్లే ఈరోజు సభలో అడుగు పెట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. ‘కర్మ అంత బలంగా ఉంటుంది. ఉండి నియోజకవర్గం నుంచి 56 వేల పైచిలుకు ఓట్లతో గెలిచి మీరు అసెంబ్లీకి వచ్చారు. గత ప్రభుత్వంలో అందరూ ఏదో రకంగా ఇబ్బందులు పడ్డారు’ అని పవన్ వ్యాఖ్యానించారు.