పరగడుపున నానబెట్టిన బాదం పప్పులు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ బాదం పప్పులు జీర్ణక్రియకు కావాల్సిన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. మలబద్ధకం సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. మెమరీ, ఏకాగ్రతకు పోషకాలు చాలా అవసరం. నానబెట్టిన బాదం పప్పులో ఇవి పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణ, చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తాయి. గుండె పనితీరు మెరుగుపడుతుంది. బరువు కూడా తగ్గుతారు.