గవర్నర్ ప్రసంగంలో పసలేదు: వైఎస్‌ షర్మిల

69பார்த்தது
గవర్నర్ ప్రసంగంలో పసలేదు: వైఎస్‌ షర్మిల
AP: గవర్నర్ ప్రసంగంలో పసలేదు, దిశా-నిర్దేశం అంతకన్నా లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఈ మేరకు సోమవారం 'ఎక్స్‌'వేదికగా ఆమె పోస్ట్‌ చేశారు. 'సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదు. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత లేదు. చంద్రబాబు విజన్ 2047కి దమ్ము లేదు. కొత్త సీసాలో పాత సారా అనే సామెత లెక్క కూటమి మ్యానిఫెస్టోనే గవర్నర్ గారు చదివారు' అని షర్మిల రాసుకొచ్చారు.

தொடர்புடைய செய்தி