HYD-నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ధ రూ.20 కోట్లతో ఆధునిక వసతులతో గత BRS ప్రభుత్వం నిర్మించిన నీరా కేఫ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించే కుట్ర చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఆదివారం ఆయన నీరా కేఫ్‌ను సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నీరా కేఫ్‌ను తొలగించి హోటల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. నీరా కేఫ్ పేరుతో ఉన్న బోర్డులన్నీ నిర్వాహకులు ఇప్పటికే తొలగించారని అసహనం వ్యక్తం చేశారు.