తెలంగాణలో జరిగిన MLC ఎన్నికల్లో కాంగ్రెస్‌ని మించి BJPకి ప్రజలు పట్టం కట్టడంపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతును ఇచ్చి, TBJPని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను' అని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.