తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు IPS అధికారులు అంజనీ కుమార్, అభిషేక్‌మహంతి, అభిలాష బిస్తలను వెంటనే ఏపీలో జాయిన్ కావాలని కేంద్ర హోంశాఖ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై శనివారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంజనీకుమార్, అభిలాష బిస్తలను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి రిలీవ్‌పై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది.