సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలకేంద్రంలో గురువారం మందకృష్ణ ఆదేశానుసారం యంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బందించడం జరిగిందని తుంగతుర్తి యంఆర్పిఎస్ ఇంచార్జి పాల్వాయి బాలయ్య అన్నారు.
బీజేపీ ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో ఎస్సి కులాల్లో ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసిందని, ఈ చివరి పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టి చట్టభద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.