సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఉన్న చైర్మన్ కనకటి వెంకన్న చేసిన అవినీతి కోర్టులో నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. దీంతో వైస్ చైర్మన్ గా ఉన్న జయసుధ సుధాకర్ రెడ్డిని చైర్మన్ గా జిల్లా అధికారులు నియమించారు. కావున చైర్మన్ గా ఆమె బాధ్యతలు తీసుకున్నారు.