ఆర్టీసీ డిపోలో కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం చొరవ చూపి పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం. రాంబాబు, స్టాఫ్&వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం ఆర్టీసీ డిపో కమిటీ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి ఉప్పు లక్ష్మయ్య, సురేష్ పాల్గొన్నారు.