ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పావర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి సమస్యలపై విన్నపాలను స్వీకరించారు.