తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల పక్షపాతని, ఆయన నాయకత్వంలో ఎస్సీ లకు న్యాయం జరుగుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. ఆదివారం సూర్యపేట జిల్లాలో జరిగిన ఎస్సీల ఎబిసిడి వర్గీకరణ పై సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన మాదిగల సమాలోచన సదస్సులో మాట్లాడారు. వర్గీకరణతో ఎస్సీలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.