కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా పిల్లలమర్రి శివాలయానికి భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. భక్తులు భారీగా తరలివస్తుండటంతో రద్దీ నెలకొంది. రుద్రాభిషేకాల అనంతరం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుండే మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎరకేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు సంతోష్ శర్మ పండ్లతో స్వామివారిని అందంగా అలంకరించారు.