ప్రపంచ మానవాళికి విముక్తిమార్గం చూపించింది కమ్యూనిజమని, రానున్న కాలం కమ్యూనిస్టుల దేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా కేంద్ర కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఉన్నారు.