ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి మార్గదర్శకాలని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తొమ్మిదవ వార్డులో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిధులు 4 లక్షలతో పాటు దాతల సహకారంతో నిర్మించిన లూర్తూ మాత మందిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.