ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కోపరేటివ్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ మత్స్యకారులు అన్ని రంగాల్లో చైతన్యవంతులు కావాలన్నారు. అనంతరంముదిరాజ్ సంఘ నాయకులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ మత్స్యకార సంఘం కన్వీనర్ మూసి శ్రీనివాస్, మూసి మట్టయ్య ఉన్నారు.