తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇటీవల స్వర్గస్తులైన తన తండ్రి పురుషోత్తం రెడ్డి చితా భస్మాన్ని కాశి పుణ్యక్షేత్రంలో గంగా నదిలో కలిపారు. ఈ సందర్భంగా పుణ్యక్షేత్రంలో ఆయన కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆయన సతీమణి కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి, మంత్రి ఉత్తమ్ కుటుంబ సభ్యులు ఉన్నారు.