అనారోగ్యంతో పాటు ప్రత్యేక పరిస్థితులు కలిగిన ఉపాధ్యాయులను ఎన్నికల విధులనుండి మినహాయింపు ఇవ్వాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రియాంక కు పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జ్యోతుల చంద్రశేఖర్, చింతరెడ్డి రామలింగారెడ్డి శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఎన్నికల విధులు నిర్వహించడంలో వారికి ఇబ్బందులు ఎదురువుతాయని ముందుగానే గుర్తించి మినహాయింపు ఇవ్వాలని కోరారు.