కోదాడ మున్సిపల్ కార్యలయం లో ప్రజా పాలన దినోత్సవాన్ని మంగళ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణా విమోచన దినోత్సవం శుభకాంక్షలు తెలిపారు. విమోచన దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వర రావు, కౌన్సిలర్ లు సిబ్బంది పాల్గొన్నారు.