నడిగూడెం మండలంలోని రామాపురం గ్రామంలో గురువారం రాత్రి అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. అగ్నిగుండం అయ్యప్ప స్వాములు నడిచి తమ భక్తిని చాటుకున్నారు. అగ్నిగుండంలో సుమారు వెయ్యి మంది స్వాములు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ మహా పడిపూజలో దీక్ష స్వాములు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.