క్రాప్ ప్రొడక్షన్ కోర్స్ చేసిన వారికి వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నడిగూడెం మండల కేంద్రానికి చెందిన అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ విద్యార్థుల సంఘం నాయకుడు కాసాని గోపీనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఈ సమస్య పై రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డికి హైదరాబాద్ లో వినతి పత్రం అందజేశాడు.